NRML: ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా సీపీఎస్ ఉద్యోగులు తమ లాగిన్‌లో మొబైల్ నంబర్, పాన్, ఈమెయిల్, నామినేషన్ వివరాలు సరిగా ఉన్నాయో లేదో పరిశీలించి, అవసరమైన సవరణలు చేయాలని జిల్లా ఖజానా అధికారి ఎస్. సరోజ నేడు ఓ ప్రకటనలో తెలిపారు. ఉద్యోగులు తమ 52 ఫార్మ్‌ను ధ్రువీకరించి సంబంధిత ట్రెజరీ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.