JGL: పెగడపల్లి మండల కేంద్రంలోని స్వయంభు రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం స్వామివారి పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ప్రతిష్ఠించి, భక్తుల శివనామస్మరణతో ఆలయం చుట్టూ ప్రదర్శన చేశారు. అనంతరం మద్దులపల్లి మాజీ సర్పంచ్ గుర్రం అనూష ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.