MBNR: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ టన్నెల్ జియో ఫిజికల్ సర్వే గురువారం సాయంత్రంతో ముగిసింది. ఈనెల మూడవ తేదీ నుంచి 12వ తేదీ వరకు విస్తృతంగా సర్వే చేపట్టారు. దాదాపు పది రోజులపాటు హెలికాప్టర్ తో అమ్రాబాద్ మండలం మన్నేవారి పల్లి అవుట్లెట్ నుంచి దోమలపెంట ఇండ్లేటి వరకు భూ పొరల అధ్యయనం చేపట్టారు. దాదాపు 1000 కిలోమీటర్ల మీద అధికారులు సర్వే చేపట్టారు.