HYD: బోయిన్పల్లి పీఎస్ పరిధిలోని డెయిరీ ఫార్మ్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. అత్యంత వేగంగా వెళ్తున్న రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కార్లలో ఉన్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కారులో మద్యం సీసాలు లభ్యమైనట్లు స్థానికులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.