ADB: ఉట్నూరు పట్టణంలోని కేబి కాంప్లెక్స్‌లో ఉన్న మహిళల గురుకుల డిగ్రీ కళాశాల ఆవరణలో కుక్కల సంచారంతో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. కళాశాల ఆవరణలో కుక్కలు గుంపులు తిరుగుతున్నాయి. పలువురు విద్యార్థినులపై కుక్కలు దాడి చేయడంతో గాయపడ్డారు. కుక్కల బెడదను అరికట్టాలని అధికారులను కోరుతున్నా పట్టించుకోవడంలేదని, సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరారు.