KNR: రామడుగు మండలంలోని అన్ని గ్రామాల బూత్ లెవెల్ అధికారులకు “స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్”(SIR) పైన బుధవారం మండల తహసీల్దార్ రాజేశ్వరి ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో ఇద్దరు ప్రత్యేక శిక్షణ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో తహసీల్దార్ అధికారులకు పలు సూచనలు చేశారు.