NRPT: మాగనూరు మండలం నేరడగంలో మార్చి 5, 6, 7 తేదీల్లో సిద్ధలింగ మహాస్వాముల జాతర జరగనుంది. ఇవాళ ప్రభోత్సవం, 6న మహారథోత్సవం, సామాజిక నాటకాలు, 7న డోలారోహణం నిర్వహిస్తామని శ్రీ పంచమసిద్ధ లింగ మహాస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు.