ADB: అమరవీరుల స్ఫూర్తితో హక్కులను సాధించుకోవాలని CITU జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న, జిల్లా కార్యదర్శి కిరణ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో CITU ఆవిర్భావ వేడుకలను శనివారం నిర్వహించి జెండాను ఆవిష్కరించారు. కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును నిరసిస్తూ ఉద్యమాలు చేపట్టాలని నాయకులు పిలుపునిచ్చారు.