MBNR: జడ్చర్లలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రూ.600 కోట్లతో బైపాస్ రోడ్డు నిర్మాణం త్వరలో చేపడతామని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు. అరైవ్ అలైవ్ సభలో ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్, రూరల్ పోలీస్ స్టేషన్లు మంజూరు చేయాలని డీజీపీ శివధర్ రెడ్డి కోరారు. రూల్స్ పాటించడమే ప్రాణాలు కాపాడుతుందని, ఓవర్ లోడ్, మద్యం సేవించి డ్రైవింగ్ వద్దని ప్రజలకు సూచించారు.