MDK: టేక్మాల్ మండలం బూర్గుపల్లి తండాకు చెందిన గర్భిణీ అనితకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పెద్ద శంకరంపేట అంబులెన్స్ సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో నొప్పులు అధికమయ్యాయి. దీంతో అంబులెన్స్‌లోనే ఈఎంటీ సతీష్ ప్రసవం చేశారు. ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.