NRML: విద్య రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఏఐఎస్ఎఫ్ విద్యార్థిసంఘ నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా శనివారం పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రభుత్వ బడులపై ప్రభుత్వం ఇకనైనా శ్రద్ధ చూపాలని డిమాండ్ చేశారు.