SRPT: పదో తరగతి వార్షిక పరీక్షల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేలా ఎంఈవోలు కృషి చేయాలని కలెక్టర్ తేజస్ ఆదేశించారు. శుక్రవారం సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి, అభ్యాసన పుస్తకాలు అందజేయాలన్నారు. రెండు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని, విద్యార్థులకు అవసరమైన పరీక్షా సామగ్రిని పంపిణీ చేయాలని అన్నారు.