MBNR: కేఎస్ఐ కాల్వ నుంచి చేగుంట, వెల్కిచర్ల గ్రామాలకు సాగునీరు వెళ్లే కాలువకు సంబంధించి గత ప్రభుత్వం పరిహారం చెల్లిస్తామని చెప్పి చెల్లించకపోవడంతో మోసపోయిన రైతులు కాల్వను పూడ్చి వేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కేఎల్ఐ కాల్వ నుంచి సాగునీరు వెళ్లే కాలువ వల్ల భూమిని కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు.