NRML: పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలను బుధవారం డీఈవో భోజన్న ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థులు ప్రతినిత్యం పాఠశాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని, వానాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా విద్యార్థులకు తగు జాగ్రత్తలు సూచించాలని తెలిపారు.