MBNR: జిల్లాలోని రాజేంద్రనగర్లో DDU-GKY & స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో యువతులకు నర్సింగ్ అసిస్టెంట్ కోర్సులో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు కో-ఆర్డినేటర్ రవికుమార్ తెలిపారు. 10TH పాసైన యువతులు ఈ శిక్షణకు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు వసతి, భోజనం, శిక్షణకు అవసరమైన మెటీరియల్ ఉచితంగా అందజేస్తామన్నారు. వివరాలకు 99496 98592ను సంప్రదించాలన్నారు.