JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భరణి నక్షత్రం సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి అనుబంధ ఆలయమైన శ్రీ యమధర్మరాజు ఆలయంలో స్వామి వారికి పురుషసూక్తం, శ్రీ లక్ష్మీ సూక్తం, మన్య సూక్తంతో అభిషేకం ఆయుష్యహోమంతో ప్రత్యేక పూజలు హారతి మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించారు.