PDPL: సైబర్ మోసాల పట్ల ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని రామగుండం సైబర్ క్రైమ్ పోలీస్ అధికారులు సూచించారు. గోదావరిఖని డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. డిజిటల్ అరెస్ట్, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, లోన్ యాప్ ఫ్రాడ్, ఏపీకే యాప్ అండ్ కేవైసీ ఫ్రాడ్ల పై వివరించారు. అవగాహనతోనే సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలన్నారు.