WGL: జిల్లా కేంద్రంలోని వరంగల్, ఖిలావరంగల్ మండలాల్లో మొంథా తుపాన్ వర్షాలకు దెబ్బతిన్న 3,025 ఇళ్ల బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.15 వేల ఆర్థిక సాయం లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతోంది. వరదల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రభావిత ప్రాంతాలు పరిశీలించి సాయం ప్రకటించారు. గత రెండు రోజులుగా బాధితుల ఖాతాల్లో డబ్బు జమ కావడం మొదలైంది.