KMM: దళితులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని KVPS రాష్ట్ర కమిటీ సభ్యులు పాపిట్ల సత్యనారాయణ అన్నారు. సోమవారం తిరుమలాయపాలెం మండల కేంద్రంలో KVPS మండల కమిటీ సమావేశం నిర్వహించారు. పాలేరు నియోజకవర్గంలో సుమారు 50 వేలకు పైగా ఉన్న దళితులను కేవలం ఓటు బ్యాంకు గానే చూస్తున్నారని చెప్పారు. దళితులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమన్నారు.