KMR: గర్భిణుల మెరుగైన వైద్య పరీక్షల కోసం 102 అంబులెన్స్‌లను ఉపయోగిస్తున్నట్లు మండల వైద్యాధికారి హేమీమా తెలిపారు. గురువారం బిక్కనూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గర్భిణులను 102 అంబులెన్స్ ద్వారా మెరుగైన వైద్య పరీక్షల నిమిత్తం KMR ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ప్రతి నెలా 9వ తేదీన, గర్భిణులను అంబులెన్స్ ద్వారా తీసుకెళ్తామన్నారు.