KMM: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆటో కార్మికులకు ఇచ్చిన రూ.12 వేల హామీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కాశీ రావు అన్నారు. శుక్రవారం సత్తుపల్లిలోని సిద్ధారం రోడ్డులో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆటో కార్మికులకు జీవనోపాధి లేకుండా పోయిందని చెప్పారు. ఆటో కార్మికులను ఆదుకోవాలన్నారు.