మేడ్చల్: సద్దుల బతుకమ్మ, దసరా పండగల వేళ సికింద్రాబాద్, కాచిగూడ, మౌలాలి రైల్వేస్టేషన్ల వద్ద రద్దీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో వారిని కంట్రోల్ చేయడం కోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసినట్లుగా జనరల్ మేనేజర్ సంజయ్ శ్రీ వాస్తవ తెలిపారు. మరోవైపు రైళ్లను డైవర్ట్ చేసిన సౌత్ సెంట్రల్ రైల్వే, చర్లపల్లి నుంచి వివిధ రైళ్లకు నడిపిస్తున్నట్లు తెలిపింది.