MBNR: లైసెన్సు ఉన్న పేలుడు పదార్థాలు అజాగ్రత్తగా వహిస్తే చర్యలు తప్పవని మహమ్మదాబాద్ ఎస్సై శేఖర్ రెడ్డి అన్నారు. నిర్లక్ష్యంగా పేలుడు పదార్థాలు నిల్వ ఉంచారని విశ్వసనీయ సమాచారం మేరకు మండల పరిధిలోని గోవిందపల్లి శివారులో ఎస్సై శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీ చేపట్టారు. సేఫ్ కస్టడీ కొరకు పలు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుని, ఏజెన్సీ మేనేజర్‌పై కేసు నమోదు చేశారు.