NRPT: దీపావళి సందర్భంగా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ దంపతులు సోమవారం సాయంత్రం తమ క్యాంపు కార్యాలయంలో దీపాలు వెలిగించి, టపాసులు కాల్చారు. సిబ్బందికి స్వీట్లు పంచి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. దీపావళి చెడుపై మంచి గెలుపుకు సంకేతమని, ఈ పండుగ ప్రతి ఇంటికి వెలుగు, ఆనందాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు.