KNR: చిగురుమామిడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ఫ్రెషర్స్ డే ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి డీఐఈవో గంగాధర్ హాజరయ్యారు. విద్యార్థులు ప్రణాళికతో చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. కళాశాలను జిల్లాలో అగ్రస్థానంలో నిలపడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.