SDPT: జగదేవపూర్ రైతు వేదికలో వ్యవసాయ శాఖ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసిన రైతు నేస్తం కార్యక్రమంలో వివిధ గ్రామాల రైతులు పాల్గొని పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లలో వచ్చే సమస్యలను వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావుకు తెలియజేశారు. పత్తిలో 8 నుంచి 12 శాతం తేమ ఉండాలనే నిబంధనను ఎత్తివేయాలని కోరారు.