WG: ‘మొంథా’ తీవ్ర తుఫాన్ మచిలీపట్నం-కాకినాడ మధ్య నరసాపురం సమీపంలో మంగళవారం రా.11:30 గంటల నుంచి రా.12:30 మధ్య తీరాన్ని దాటిందని APSDMA తెలిపింది. ఇది రానున్న 6 గంటల్లో తుఫానుగా బలహీనపడుతుందని వెల్లడించింది. కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంత జిల్లాల్లో ఈదురుగాలులు భారీగా వీస్తున్నాయి.