KNR: సప్తగిరి కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న ప్రైమరీ హెల్త్ సెంటర్ను మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ మంగళవారం పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించిన కమిషనర్, సంబంధిత అధికారులతో మాట్లాడి ఆలస్యాలు లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేలా, సదుపాయాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు.