ATP: మొంథా తుఫాన్ ప్రభావంతో ధర్మవరం–మచిలీపట్నం (17216) రైలు సర్వీసును రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. బుధవారం ధర్మవరం నుంచి మచిలీపట్నం వెళ్లే రైలు (17215) కూడా రద్దు చేసినట్లు వెల్లడించారు. తుఫాను ప్రభావం తగ్గిన తర్వాత రైలు సేవలు మొదలవుతాయని పేర్కొన్నారు.