ATP: ప్రజల భద్రత, రక్షణతో పాటు ప్రాణాలను నిలబెట్టడం పోలీసుల ప్రధాన కర్తవ్యమని జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు. పోలీసు అమర వీరుల వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీసు హెడ్‌క్వార్టర్స్ షాదీఖానాలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎస్పీ స్వయంగా రక్తదానం చేసి సిబ్బందికి స్ఫూర్తినిచ్చారు. సుమారు 200 మంది పోలీసు సిబ్బంది రక్తదానం చేశారు.