WGL: సంగెం మండలంలోని గుంటూరుపల్లి గ్రామపంచాయతీ నర్సరీని మంగళవారం డీఆర్డీవో సందర్శించారు. నర్సరీలో మొక్కల పెంపకం, నిర్వహణ విధానంపై ఆమె ఆరా తీశారు. మొక్కల సంరక్షణ, నీటి పంపిణీ, ఎరువుల వినియోగంపై అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.