KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్కలో గురువారం పత్తి దిగుమతులు భారీగా తగ్గాయి. 2 వాహనాల్లో 8 క్వింటాళ్ల విడిపత్తిని మాత్రమే రైతులు తీసుకొని వచ్చారు. దీనికి గరిష్ఠంగా క్వింటాకు రూ.7,750, కనిష్ఠంగా రూ. 7,550 ధరకు ప్రైవేట్ వ్యాపారులు బహిరంగ వేలం ద్వారా కొనుగోలు చేశారు. రైతులు నాణ్యత విషయంలో జాగ్రత్తలు వహించాలని మార్కెట్ అధికారులు సూచిస్తున్నారు.