BDK: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టనున్న 99 రోజుల కార్యాచరణపై మంత్రి సీతక్క వీసీ నిర్వహించారు. భద్రాద్రి కలెక్టరేట్ నుంచి అడిషనల్ కలెక్టర్ విద్యాచందన, జడ్పీసీఈవో నాగలక్ష్మి, డీపీఓ సుధీర్ పాల్గొన్నారు. మార్చి 6 నుంచి 15 వరకు పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల క్లియరెన్స్, 16 నుంచి 31 వరకు ఆదాయం పెంపుదల కార్యక్రమాలు ఉంటాయన్నారు.