ఎన్టీఆర్ పుట్టినరోజు మే 28 లోపు ఆయనకు భారతరత్న ప్రకటించాలని నటుడు మురళీమోహన్ (Murali Mohan) కేంద్ర ప్రభుత్వన్ని కోరారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారకరామారావు (NTR) శతజయంతి వేడుకల కార్యక్రమం కూకట్ పల్లిలోని కైతలాపూర్ మైదానంలో ఘనంగా నిర్వహించారు.ఎన్టీఆర్ తనను ఎప్పుడూ తమ్ముడూ అని పిలిచేవారని మురళీమోహన్ గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్ వంటి మహోన్నత వ్యక్తికి భారతరత్న ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు.ఈ కార్యక్రమానికి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా (D. RAJA )కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్ గొప్ప నటనతో ప్రజల మనసులు దోచుకున్నారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లో తనదైన ముద్రవేశారని కొనియాడారు. ఎన్టీఆర్ చాలా సున్నిమతమైన మనస్తత్వం కలిగిన రాజకీయ నేత అని అభిప్రాయపడ్డారు.
“తెలుగు ప్రజలకు రాముడన్నా .. కృష్ణుడన్నా రామారావుగారే. వారు సాధించిన విజయాలను గురించిన ఆలోచన చేస్తూ, వారు వేసిన దారుల్లో నడుస్తూ ఆయనను గుర్తుచేసుకున్నప్పుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదని హీరో రాంచరణ్ (Ram charan) అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu),బాలకృష్ణ, పురందేశ్వరి, భువనేశ్వరి, లోకేశ్వరి, వసుంధర, బ్రహ్మాణి, దేవాన్ష్, నందమూరి కుటుంబ సభ్యులతోపాటు రాజకీయ ప్రముఖులు సీతారాం ఏచూరి, సినీ ప్రముఖులు వెంకటేశ్, జయప్రద, జయసుధ(Jayasudha), మురళీ మోహన్, బాబు మోహన్, విజయేంద్ర ప్రసాద్, అల్లు అరవింద్, అశ్వినీదత్, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, అనిల్ రావిపూడి, శ్రీలీలతోపాటు కన్నడ నటుడు శివరాజ్‌కుమార్, నాగచైతన్య, సుమంత్, సిద్ధు జొన్నలగడ్డ, అడివిశేష్ వంటి పలువురు సినీ తారలు ఈ వేడుకలకు హాజరయ్యారు.