»Bjp Leader Supports Daughters Marriage With Muslim Youth
Uttarakhand : ముస్లిం యువకుడితో కుమార్తె పెళ్లిని సమర్ధించిన బీజేపీ నేత
ఉత్తరాఖండ్ (Uttarakhand) కు చెందిన బీజేపీ నేత కూతురు ఓ ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకోబోతున్నది. ఈ పెళ్లికి సంబంధించిన కార్డు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హిందుత్వ హార్డ్‌లైనర్లు మండిపడుతున్నారు.
ఉత్తరాఖండ్ (Uttarakhand) ఓ బీజేపీ నేత కుమార్తె వెడ్డింగ్ కార్డ్ (Wedding card) సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఉత్తరాఖండ్‌లోని పౌరీ ప్రాంతానికి చెందిన యశ్పాల్ బెనమ్ కూతురును ఓ ముస్లిం వ్యక్తిని పెళ్లి చేస్తుండడంతో ఆయనపై జనాలు పలు విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ (BJP), వీహెచ్‌పీ, ఇతర రైట్‌వింగ్ సంస్థలు కన్నెర్ర చేశాయి. ఆయన దిష్టిబొమ్మలను దగ్ధం చేశాయి. ఇంతకూ…యశ్‌పాల్‌పై కార్యకర్తల ఆగ్రహం వెనుక కారణం ఏమిటి? ఆయన తన కుమార్తెను ఓ ముస్లిం యువకుడికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకోవడం, పెళ్లీ కార్డు అందరికీ పంపి వివాహ ఏర్పాట్లు చేసుకోవడమే అందుకు కారణం. హిందూ అమ్మాయిని ముస్లిం యువకుడికి ఇచ్చి ఎలా పెళ్లి చేస్తారని నిరసనకారులు ప్రశ్నిస్తున్నారు.. దీనిపై యశ్పాల్ బేనామ్ (Yashpal Baynam)ఘాటైన సమాధానం ఇచ్చారు. ”ఇది 21వ శతాబ్దం” అని గుర్తు చేశారు.’ప్రతి విషయాన్ని బూతద్దంతో చూసే వాళ్లకు నేను చెప్పదలచుకున్నది ఒక్కటే. పెళ్లి అనేది రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం.
ఇందులో ఇద్దరు యువతీ, యువకుల ప్రమేయం ఉంటుంది. ఈ పరిస్థితిలో మతం అనేది నాకు ప్రధానం కాదు. హిందూ సంప్రదాయం (Hindu tradition) ప్రకారం వివాహం జరిపించాలని నిర్ణయించాను” అని ఉత్తరాఖండ్ బీజేపీ నేత యశ్పాల్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.కాగా, దీనిపై బీజేపీ సభ్యుడు, గో పరిరక్షణ (Go conservation) సభ్యుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికీ తాము సాంప్రదాయ దుస్తులనే ధరిస్తామని, సంప్రదాయాలకు కట్టుబడి వ్యవహరిస్తామని చెప్పారు. మన సంస్కృతికి భిన్నంగా ఏది జరిగినా అది తమకు ఆమోదయోగ్యం కాదని, ఇలాంటి వివాహాలను తాము అంగీకరించమని చెప్పారు. వీహెచ్‌పీ (VHP) జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దీపక్ గౌడ్ కూడా ఇదే తరహాలో స్పందించారు. ఇలాంటి వివాహాలను తాము అంగీకరించమని చెప్పారు.యశ్పాల్ ప్రస్తుతం పౌరి (Pauri) మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ (Congress) మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఆ తర్వాత బీజేపీలో చేరారు. కాగా, లక్నో (Lucknow) యూనివర్శిటీలో చదువుతున్న యశ్పాల్ కుమార్తె ముస్లిం యువకుడిని ప్రేమించిందని, వివాహం చేసుకోవాలని ఉభయులూ నిర్ణయించుకున్నారని యశ్పాల్ సన్నిహితులు తెలిపారు.