PDPL: సింగరేణి లాభాల్లో వాటా రూ. 500 పెంచి కాంట్రాక్టు కార్మికులను అవమానించారని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు మండిపడ్డారు. గోదావరిఖనిలోని సీఐటీయూ ఆఫీస్లో బుధవారం సాయంత్రం మాట్లాడారు. సింగరేణి లాభాల్లో కాంట్రాక్టు కార్మికుల రెక్కల కష్టం ఎంతో ఉందన్నారు. ఈనెల 25న రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టనున్నామని తెలిపారు.