ASF: SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో కుట్టు మిషన్, మగ్గం వర్క్‌లో ఉచిత శిక్షణ అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ MD గౌస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల నిరుద్యోగ యువతీ, యువకులు అక్టోబర్ 5లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అక్టోబర్ 6 నుంచి కుట్టు మిషన్, 8 నుంచి మగ్గం వర్క్ తరగతులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.