NTR: ‘స్వచ్ఛ భారత్ మిషన్’లో భాగంగా ‘స్వచ్ఛ ఉత్సవ్’ కార్యక్రమాన్ని గురువారం నాడు నందిగామ పట్టణంలోని మధిర ఆర్చి రోడ్‌పై నున్న చిన్న బ్రిడ్జి వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొని, మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రతలపై సందేశం ఇచ్చారు. స్వచ్ఛత మన జీవితంలో అంతర్భాగం కావాలని, మనమంతా కలిసి పర్యావరణాన్ని కాపాడుకుందామని కోరారు.