W.G: సత్రంపాడులో యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఆధ్వర్యంలో అక్టోబర్ 3 నుంచి సీసీ కెమెరా రిపేరింగ్, జ్యూట్ బాగ్స్ తయారీపై ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ ఫణి కిషోర్ ఇవాళ తెలిపారు. సీసీ కెమెరా రిపేరింగ్ పై 13 రోజులు పురుషులకు, జ్యూట్ బాగ్స్ తయారిపై 14 రోజులు మహిళలకు శిక్షణ, వసతి, అందిస్తామన్నారు.