BDK: గుండాల మండలంలో నేడు ఎమ్మెల్యే పాయం పర్యటిస్తారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రకటించారు. ఈ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే ఉపాధి హామీ కూలీలకు వస్తువులు పంపిణీ చేస్తారని అన్నారు. అలాగే కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేస్తారని తెలిపారు. కావున ఎమ్మెల్యే పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.