KMM: రాజ్యసభ స్థానానికి నూతనంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన రాజ్యసభ సభ్యుడికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ హక్కుల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో వేం నరేంద్ర్ రెడ్డి బలమైన గొంతుకను వినిపిస్తారనే ఆశాభావాన్ని ఎమ్మెల్యే వ్యక్తం చేశారు.