MDCL: చంద్రపురం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం సుదర్శన, నారసింహ హోమం, లక్ష్మీనారాయణ తిరుకల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సుదర్శన–నారసింహ హోమం లోక కళ్యాణానికి దోహదపడుతూ, శత్రువుల నుంచి రక్షణ కల్పిస్తుందని నిర్వాహకులు తెలిపారు. అలాగే ఆరోగ్య సమస్యలు తగ్గి, మానసిక ప్రశాంతత, సానుకూలత పెరగుతుందన్నారు.