WNP: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ జడ్జి రజిని అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బసవన్న గడ్డ అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ నిర్వాహకులకు పర్యావరణంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. వాయు కాలుష్యం వలన పలు రకాల ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని అందుకు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు.