BDK: సింగరేణిలో కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్న యూనియన్ బ్యాంక్‌కు సింగరేణి యాజమాన్యం చేసిన సూచనల మేరకు సహజ మరణం చెందిన కార్మికులకు కూడా ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించింది. యూనియన్ బ్యాంకులో కార్పోరేట్ శాలరీ అకౌంటు కలిగి ఉన్న కార్మికులు మృతి చెందినట్లయితే వారికి పది లక్షల బీమా సౌకర్యాన్ని వర్తింప జేస్తూ నిర్ణయం తీసుకుంది.