NLG: కనగల్ మండలం ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని అర్చకులు ఆదివారం మధ్యాహ్నం మూసివేశారు. చంద్రగ్రహణం సందర్భంగా… శ్రీ అమ్మవారి ఆలయంను ద్వార బంధనం చేయడం జరిగిందని అర్చుకులు పేర్కొన్నారు. సోమవారం ఉదయం అభిషేకం, ఆలయ సంప్రోక్షణ తర్వాత భక్తులకు దర్శనాలు, అర్చనలు ఉంటాయని ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి తెలిపారు.