JGL: గ్రామ పంచాయతీలో వివిధ రకాల పన్నుల వాసులలో వేగం పెంచి 100% పన్నుల వసూలకు కృషి చేయాలని జెడ్పీ సీఈవో గౌతంరెడ్డి అన్నారు. పెగడపల్లి మండలంలోని నరసింహునిపేట గ్రామపంచాయతీని సందర్శించి పనులను పరిశీలించారు. గ్రామపంచాయతీ పలు రికార్డులను తనిఖీ చేశారు. నేషనల్ అవార్డుకు నామినేటెడ్ అయినందున గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పరచాలని తెలిపారు.