NZB: రూరల్ మండలంలోని పాల్దా గ్రామంలో మంగళవారం బీజేపీ కార్యకర్తపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అడ్మిన్ డీసీపీ బస్వా రెడ్డిని కలిసి విన్నవించారు. రూరల్లో రౌడీయిజంపై ఉక్కుపాదం మోపాలని కోరారు. ఇంకోసారి బీజేపీ కార్యకర్తల జోలికొస్తే ఖబడ్డార్ అంటూ బుధవారం హెచ్చరించారు.