KMM: సత్తుపల్లి మండలం కాకర్లపల్లిలో ప్రమాదవశాత్తూ నీటి సంపులో పడి ఓలేటి వెంకటరమణ (50) అనే వ్యక్తి సోమవారం మృతి చెందారు. ఆయన మొక్కజొన్న పొత్తులు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించేవారు. సంపులో పడిన వెంకటరమణను గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.