HYD: రోడ్డు ప్రమాదంలో జీవన్మృతుడైన జనగామ జిల్లాకు చెందిన సాఫ్ట్వెర్ ఉద్యోగి గాదె యుగంధర్ (29) అవయవదానంతో ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపారు. ఈ నెల 5న ఉప్పల్‌లో ప్రమాదానికి గురైన ఆయనకు వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. జీవన్‌దాన్ బృందం కౌన్సెలింగ్‌తో కుటుంబ సభ్యులు అంగీకరించగా.. యుగంధర్ నుంచి 2 కిడ్నీలు, కాలేయం, కంటి కార్నియాలను సేకరించారు.