SRPT: నడిగూడెం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులకు మానసిక, ఆరోగ్య సేవలపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి ఇబ్బందులు ఉన్నవారు టెలీ-మానస్ టోల్ ఫ్రీ నెంబరు 14416కు ఫోన్ చేస్తే సైకియాట్రిస్ట్ కౌన్సిలింగ్ ఇస్తారని డా. హరినాథ్ సూచించారు.